2, నవంబర్ 2011, బుధవారం

మధురం మధురం


 
"తొలకరి జల్లులో తడుస్తూ వుంటే మధురం మధురం
నీ ప్రేమ జల్లు లో తడుస్తూ వుంటే అది మధురాతి మధురం
అందమైన ఊహా లోకం లో ఓలలాడుతుంటే మధురం మధురం
నీ ప్రేమ లోకం లో విహరిస్తుంటే మధురాతి మధురం
హిమశిఖరాన వెన్నెల వనమంటూ వుంటే మధురం మధురం
అది మన ఇద్దరికే అనుమతి అయితే మధురాతి మధురం "



1, నవంబర్ 2011, మంగళవారం

ప్రేమ నిలయం




అందమైన, ఆనందమయమైన, అద్భుతమైన మా కలలకి ప్రతీక అది 
మేము నిర్మించుకున్న నిర్మలమైన ఆ ప్రేమ నిలయం
ఇంద్రధనస్సు అందాలే చూశామా, తొలకరి చినుకుల అనుభూతినే పొందామా 
మా కలలే దీపాలై, మా ప్రేమవనంలోని పవిత్ర పుష్పాలతోనే అలంకరించామా
ఆ మా ప్రేమగుడిని, మాధైన ఆ ప్రేమ గుడిని
మా ప్రేమ అఖండ జ్యోతిలా వెలగాలని పూజిస్తున్న తరుణంలో ...........
                        
                               ఏ కన్ను కుట్టిందో, ఏ గాలి సోకిందో  
                               ఏ దయ్యమో, ఏ భూతమో ,ఏ రాక్షస ఘడియలలో 
                               ఏ దుష్టమంత్రం పలికెనో,
కళ్ళ ఎదుటే మా ప్రేమాలయం బీటలు వారుతుంటే
ఆ బీటలమీద సమ్మెట  పోటులు పడుతున్నాయి
ఆ ప్రేమగుడి గర్భాన ఏ విషబీజం నాటారో, ఏ నీరు పోసి పెంచారో
కళ్ళ ఎదుటే బీటలు వారుతోంది ఈ మా ప్రేమాలయం
కంటికి కూడా తెలియని  కన్నీటితో  దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్న
ఈ గుండె భాధ ఎవరికి చెప్పెను  ఎలాచెప్పను ఎవరాలకించగలరు ఎవరూహించగలరు













మౌనం



ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గల గలా మాట్లాడుతుంది
మనల్ని నిశబ్ద పంజరం లో కట్టిపెట్టి, ఎందుకిలా అది మాట్లాడుతుంది 
అది ఎల్లలు దాటి  మాట్లాడుతోంటే మనం ఎందుకిలా అచేతనంగా నిస్సహాయంగా మిగిలిపోయాం
మనం అందరిలా కాదు, కాకూడదు అనుకుంటూనే అందరి లానే మారిపోతున్నామా
అన్న ప్రశ్నచితిలా మండుతుంటే, కన్న కలలు కలే అది ఒక "కల్ల" లే అంటూవుంటే
అవును మరి తరచి చూస్తే అది నిజమే కదా అని విధి నన్ను చూసి విర్రవీగుతూ వెక్కిరిస్తూ
వెకిలి నవ్వులు నవ్వుతూ వుంటే ,ఏం చెప్పను ఎలా చెప్పను
ఈ మౌనం మాట్లాడుతూనే వుంది నీతో, నాతో, దీనిని ధాటి వెళ్ళేదేలా
నీ చేయి కలవకుండా నేను నడుస్తున్నా అది నిస్సహాయపు, అసంపూర్ణ నడక అని నీకు తెలియదా
ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గూడు కట్టాలని చూస్తుంది
ఎందుకిలా ఈ మౌనం మన పాలిట పాషాణ హృదయం తో వ్యవహరిస్తుంది

31, అక్టోబర్ 2011, సోమవారం

అమ్మ ఒడిలో

అమృతం రుచి ఎన్నడూ చూడలేదు కాని అమ్మ ప్రేమ రుచిని మాత్రం మరు జన్మకైనా ఏ జన్మకైనా మరువలేనులే. ఎన్ని బడులు తిరిగినా అమ్మ ఒడి లో నేర్చుకున్న పాఠాలు వేరు లే. మాయా ప్రపంచం మాయలను తన కనులతో చూపింది. ప్రేమ పాశం ఎలా వుండాలో నేర్పింది. అన్నా చెల్లెళ్ళ అనుభంధం మె బడి లో నే నేర్పింది. దయ,ప్రేమ,ఆవేశం,పట్టుదల లాంటి ఓనమాలతో పాటు నవ సమాజపు సవాళ్లను ఎదుర్కొనే పాఠాలనూ తనే నేర్పింది .నా వలన నా పనుల వలన కలిగే భాధని గుండెల మీద మోసి భారాన్ని బయటకు కనిపించనివ్వదు కదా.. కష్టం వచ్చినా చల్లని ఒడిలో సేద తీర్చుకున్నాను. నా ఉన్నతికై అలుపెరగని ప్రయాణం చేసి నా సుఖమే తన సుఖమై తన ఆశలను,ఆనందాలను తనలోనే దాచుకొని బయటకు నవ్వే నవ్వు నా మనసుకేల తెలియదు. ఏ జన్మలో ఏమి ఇచ్చి ఆమె ఋణం తీర్చుకోగలను.


  

23, మే 2008, శుక్రవారం

ప్రశాంత దీపం

వాడు ఉన్నతమైన వాడే కాని కాలం కాటు కి వాడు కూడా బలి అయినాడు. ఈ నాటక బూటక ప్రపంచం లో ని అసూయ ద్వేషం వాడిని కూడా చుట్టుముట్టాయి.


"తప్పుడు ఆలోచనల వేటగాడు తరుముతున్నాడు
అసూయ సైతాను రానే వచ్చాడు
ద్వేషం రాక్షషి ఎదురుగానే తిష్ట వేసింది
అందరూ కలసి ఆ జీవి ప్రశాంత దీపం ఆర్పి వేశారు"

21, మే 2008, బుధవారం

సాగిపోనీ సాగిపోనీ




--------------------------------------------------------

సాగిపోనీ సాగిపోనీ ఉరకలేస్తున్న నీ ఉడుకు రక్తాన్ని
నర్తించనీ నర్తించనీ నీ ఆశయాన్నినర నరాన నర్తించనీ
జంకకు తలదించకు తలవొంచకు
సాగిపోనీ సాగిపోనీ ఉరకలేస్తున్న నీ ఉడుకు రక్తాన్ని 
నర్తించనీ నర్తించనీ నీ ఆశయాన్నినర నరాన నర్తించనీ
మేల్కొలుపు మేల్కొలుపు నిద్రావస్ట్హ లో నున్న నీ నిజస్వరూపాన్ని
అణగారిపోయి ఆదరణ లేకుండా బిక్కు బిక్కు మంటూ 
అంధకార అగాధం లో దాగి వున్ననీ ప్రతిభ ను వెలికి తీసి
సృష్టించు సృష్టించు మరో సారి ప్రభంజనం సృష్టించు
సాగి పో సాగిపో 
మండుతున్న నెత్తురుతో , నిండియున్న ఈ యుక్తి శక్తుల తో



































ఆవేదన


ఒక మనిషి ఈ నవ జీవన సమాజంలో తన మనసు బాట ని అందులో ఇమద్చలేక, తనూ అందరి లో ఒకడై,తన మనసు చూపే బాటన నడవలేక అవిటివాడు ఐనప్పుడు, తను సాధించాలని పరుగులెత్తి ఓడినప్పుడు

"ఇది కవితా కాదు, నేను కవినీ కానుపదాల వరుస అంతకన్నా తెలియదు
అలంకారాలు,ఛందస్సులు అసలే రావు
క్షణ క్షణం అనుక్షణం ప్రతి క్షణం నా హృదయాంతర అంతరాళం లో
రగులుతూ, మండుతూ నన్ను దహించి వేస్తున్న నిప్పు కణికల్లామ్టి భావాలివి
ఏదో,ఏదేదో శోధించి సాధించాలన్న ఆవేదన
సాధించలేని మరు క్షణం నా హృదయాగ్ని నన్ను దహించివేస్తుంది
నైతిక విలువలు తెలిసి వాటి ఎడల నిలువలేక పారిపోయిన
పిరికి పందను నేను. సర్వ సుఖాలను త్యజించి సమాజ సేవకై
అంకితం కావాలన్నఆశయం.
కానీ నా వాళ్లు, నాది, అన్నా బంధాల మధ్య బందీ గా మిగిలిపోయాను
ఏముంది ఏముంది ఇంకేముంది ఈ మానవ జీవితం లో
నలుగురికి నాలుగు మంచి పనులు చేయలేక పోయిన
ఈ నా మానవ జీవితం లో
తుచ్చమానవుడిని నేను. నీచ మానవుణ్ణి నేను
పిరికిపందను నేను
ద్వేషించు ద్వేషించు నన్ను
నన్ను నేను ద్వేషించుకోనేలా ద్వేషించు"