23, మే 2008, శుక్రవారం

ప్రశాంత దీపం

వాడు ఉన్నతమైన వాడే కాని కాలం కాటు కి వాడు కూడా బలి అయినాడు. ఈ నాటక బూటక ప్రపంచం లో ని అసూయ ద్వేషం వాడిని కూడా చుట్టుముట్టాయి.


"తప్పుడు ఆలోచనల వేటగాడు తరుముతున్నాడు
అసూయ సైతాను రానే వచ్చాడు
ద్వేషం రాక్షషి ఎదురుగానే తిష్ట వేసింది
అందరూ కలసి ఆ జీవి ప్రశాంత దీపం ఆర్పి వేశారు"

21, మే 2008, బుధవారం

సాగిపోనీ సాగిపోనీ




--------------------------------------------------------

సాగిపోనీ సాగిపోనీ ఉరకలేస్తున్న నీ ఉడుకు రక్తాన్ని
నర్తించనీ నర్తించనీ నీ ఆశయాన్నినర నరాన నర్తించనీ
జంకకు తలదించకు తలవొంచకు
సాగిపోనీ సాగిపోనీ ఉరకలేస్తున్న నీ ఉడుకు రక్తాన్ని 
నర్తించనీ నర్తించనీ నీ ఆశయాన్నినర నరాన నర్తించనీ
మేల్కొలుపు మేల్కొలుపు నిద్రావస్ట్హ లో నున్న నీ నిజస్వరూపాన్ని
అణగారిపోయి ఆదరణ లేకుండా బిక్కు బిక్కు మంటూ 
అంధకార అగాధం లో దాగి వున్ననీ ప్రతిభ ను వెలికి తీసి
సృష్టించు సృష్టించు మరో సారి ప్రభంజనం సృష్టించు
సాగి పో సాగిపో 
మండుతున్న నెత్తురుతో , నిండియున్న ఈ యుక్తి శక్తుల తో



































ఆవేదన


ఒక మనిషి ఈ నవ జీవన సమాజంలో తన మనసు బాట ని అందులో ఇమద్చలేక, తనూ అందరి లో ఒకడై,తన మనసు చూపే బాటన నడవలేక అవిటివాడు ఐనప్పుడు, తను సాధించాలని పరుగులెత్తి ఓడినప్పుడు

"ఇది కవితా కాదు, నేను కవినీ కానుపదాల వరుస అంతకన్నా తెలియదు
అలంకారాలు,ఛందస్సులు అసలే రావు
క్షణ క్షణం అనుక్షణం ప్రతి క్షణం నా హృదయాంతర అంతరాళం లో
రగులుతూ, మండుతూ నన్ను దహించి వేస్తున్న నిప్పు కణికల్లామ్టి భావాలివి
ఏదో,ఏదేదో శోధించి సాధించాలన్న ఆవేదన
సాధించలేని మరు క్షణం నా హృదయాగ్ని నన్ను దహించివేస్తుంది
నైతిక విలువలు తెలిసి వాటి ఎడల నిలువలేక పారిపోయిన
పిరికి పందను నేను. సర్వ సుఖాలను త్యజించి సమాజ సేవకై
అంకితం కావాలన్నఆశయం.
కానీ నా వాళ్లు, నాది, అన్నా బంధాల మధ్య బందీ గా మిగిలిపోయాను
ఏముంది ఏముంది ఇంకేముంది ఈ మానవ జీవితం లో
నలుగురికి నాలుగు మంచి పనులు చేయలేక పోయిన
ఈ నా మానవ జీవితం లో
తుచ్చమానవుడిని నేను. నీచ మానవుణ్ణి నేను
పిరికిపందను నేను
ద్వేషించు ద్వేషించు నన్ను
నన్ను నేను ద్వేషించుకోనేలా ద్వేషించు"