2, నవంబర్ 2011, బుధవారం

మధురం మధురం


 
"తొలకరి జల్లులో తడుస్తూ వుంటే మధురం మధురం
నీ ప్రేమ జల్లు లో తడుస్తూ వుంటే అది మధురాతి మధురం
అందమైన ఊహా లోకం లో ఓలలాడుతుంటే మధురం మధురం
నీ ప్రేమ లోకం లో విహరిస్తుంటే మధురాతి మధురం
హిమశిఖరాన వెన్నెల వనమంటూ వుంటే మధురం మధురం
అది మన ఇద్దరికే అనుమతి అయితే మధురాతి మధురం "



1, నవంబర్ 2011, మంగళవారం

ప్రేమ నిలయం




అందమైన, ఆనందమయమైన, అద్భుతమైన మా కలలకి ప్రతీక అది 
మేము నిర్మించుకున్న నిర్మలమైన ఆ ప్రేమ నిలయం
ఇంద్రధనస్సు అందాలే చూశామా, తొలకరి చినుకుల అనుభూతినే పొందామా 
మా కలలే దీపాలై, మా ప్రేమవనంలోని పవిత్ర పుష్పాలతోనే అలంకరించామా
ఆ మా ప్రేమగుడిని, మాధైన ఆ ప్రేమ గుడిని
మా ప్రేమ అఖండ జ్యోతిలా వెలగాలని పూజిస్తున్న తరుణంలో ...........
                        
                               ఏ కన్ను కుట్టిందో, ఏ గాలి సోకిందో  
                               ఏ దయ్యమో, ఏ భూతమో ,ఏ రాక్షస ఘడియలలో 
                               ఏ దుష్టమంత్రం పలికెనో,
కళ్ళ ఎదుటే మా ప్రేమాలయం బీటలు వారుతుంటే
ఆ బీటలమీద సమ్మెట  పోటులు పడుతున్నాయి
ఆ ప్రేమగుడి గర్భాన ఏ విషబీజం నాటారో, ఏ నీరు పోసి పెంచారో
కళ్ళ ఎదుటే బీటలు వారుతోంది ఈ మా ప్రేమాలయం
కంటికి కూడా తెలియని  కన్నీటితో  దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్న
ఈ గుండె భాధ ఎవరికి చెప్పెను  ఎలాచెప్పను ఎవరాలకించగలరు ఎవరూహించగలరు













మౌనం



ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గల గలా మాట్లాడుతుంది
మనల్ని నిశబ్ద పంజరం లో కట్టిపెట్టి, ఎందుకిలా అది మాట్లాడుతుంది 
అది ఎల్లలు దాటి  మాట్లాడుతోంటే మనం ఎందుకిలా అచేతనంగా నిస్సహాయంగా మిగిలిపోయాం
మనం అందరిలా కాదు, కాకూడదు అనుకుంటూనే అందరి లానే మారిపోతున్నామా
అన్న ప్రశ్నచితిలా మండుతుంటే, కన్న కలలు కలే అది ఒక "కల్ల" లే అంటూవుంటే
అవును మరి తరచి చూస్తే అది నిజమే కదా అని విధి నన్ను చూసి విర్రవీగుతూ వెక్కిరిస్తూ
వెకిలి నవ్వులు నవ్వుతూ వుంటే ,ఏం చెప్పను ఎలా చెప్పను
ఈ మౌనం మాట్లాడుతూనే వుంది నీతో, నాతో, దీనిని ధాటి వెళ్ళేదేలా
నీ చేయి కలవకుండా నేను నడుస్తున్నా అది నిస్సహాయపు, అసంపూర్ణ నడక అని నీకు తెలియదా
ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గూడు కట్టాలని చూస్తుంది
ఎందుకిలా ఈ మౌనం మన పాలిట పాషాణ హృదయం తో వ్యవహరిస్తుంది