1, నవంబర్ 2011, మంగళవారం

మౌనం



ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గల గలా మాట్లాడుతుంది
మనల్ని నిశబ్ద పంజరం లో కట్టిపెట్టి, ఎందుకిలా అది మాట్లాడుతుంది 
అది ఎల్లలు దాటి  మాట్లాడుతోంటే మనం ఎందుకిలా అచేతనంగా నిస్సహాయంగా మిగిలిపోయాం
మనం అందరిలా కాదు, కాకూడదు అనుకుంటూనే అందరి లానే మారిపోతున్నామా
అన్న ప్రశ్నచితిలా మండుతుంటే, కన్న కలలు కలే అది ఒక "కల్ల" లే అంటూవుంటే
అవును మరి తరచి చూస్తే అది నిజమే కదా అని విధి నన్ను చూసి విర్రవీగుతూ వెక్కిరిస్తూ
వెకిలి నవ్వులు నవ్వుతూ వుంటే ,ఏం చెప్పను ఎలా చెప్పను
ఈ మౌనం మాట్లాడుతూనే వుంది నీతో, నాతో, దీనిని ధాటి వెళ్ళేదేలా
నీ చేయి కలవకుండా నేను నడుస్తున్నా అది నిస్సహాయపు, అసంపూర్ణ నడక అని నీకు తెలియదా
ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గూడు కట్టాలని చూస్తుంది
ఎందుకిలా ఈ మౌనం మన పాలిట పాషాణ హృదయం తో వ్యవహరిస్తుంది

1 కామెంట్‌:

రసజ్ఞ చెప్పారు...

ఎందుకిలా ఈ మౌనం మన ఇద్దరి మధ్యన గూడు కట్టాలని చూస్తుంది
ఎందుకిలా ఈ మౌనం మన పాలిట పాషాణ హృదయం తో వ్యవహరిస్తుంది బాగుందండీ! మౌనమే చాలా వాటికి సమాధానాలు చెప్తుంది కూడా!