1, నవంబర్ 2011, మంగళవారం

ప్రేమ నిలయం




అందమైన, ఆనందమయమైన, అద్భుతమైన మా కలలకి ప్రతీక అది 
మేము నిర్మించుకున్న నిర్మలమైన ఆ ప్రేమ నిలయం
ఇంద్రధనస్సు అందాలే చూశామా, తొలకరి చినుకుల అనుభూతినే పొందామా 
మా కలలే దీపాలై, మా ప్రేమవనంలోని పవిత్ర పుష్పాలతోనే అలంకరించామా
ఆ మా ప్రేమగుడిని, మాధైన ఆ ప్రేమ గుడిని
మా ప్రేమ అఖండ జ్యోతిలా వెలగాలని పూజిస్తున్న తరుణంలో ...........
                        
                               ఏ కన్ను కుట్టిందో, ఏ గాలి సోకిందో  
                               ఏ దయ్యమో, ఏ భూతమో ,ఏ రాక్షస ఘడియలలో 
                               ఏ దుష్టమంత్రం పలికెనో,
కళ్ళ ఎదుటే మా ప్రేమాలయం బీటలు వారుతుంటే
ఆ బీటలమీద సమ్మెట  పోటులు పడుతున్నాయి
ఆ ప్రేమగుడి గర్భాన ఏ విషబీజం నాటారో, ఏ నీరు పోసి పెంచారో
కళ్ళ ఎదుటే బీటలు వారుతోంది ఈ మా ప్రేమాలయం
కంటికి కూడా తెలియని  కన్నీటితో  దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్న
ఈ గుండె భాధ ఎవరికి చెప్పెను  ఎలాచెప్పను ఎవరాలకించగలరు ఎవరూహించగలరు













3 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

శ్రీరామ్.... మనసులో బాధ అక్షరబద్ధమై ఆబీజాక్షరం మనసును దహించే విషబీజాన్ని నిలువునా కాల్చేస్తుంది. మీ రోదిస్తున్న గుండె చప్పుళ్ళు ప్రతి పాఠకునికి విపిస్తుంది. వ్రాస్తూ ఉండండి తిరిగి అనంతమైన ప్రేమాలయం మనసులో రూపుదిద్దుకొనేవరకూ. పరిధిదాటి ప్రపంచమే ప్రేమాలయం అయ్యేంతవరకు.

Disp Name చెప్పారు...

పోస్టులు బాగున్నా ఆ బ్లాక్ కలర్ బాక్ డ్రాప్ లో అసలు చదవటాని కి చాలా కష్టం గా ఉంది. కొద్ది గా బెటర్ బాక్ డ్రాప్ వేయండి

Sreeman B చెప్పారు...

జిలేబి గారు
ఇప్పుడు ఎలా ఉందండి మార్చిన తరువాత, మీ సలహాకి ధన్యవాదములు
భాస్కర రామి రెడ్డి గారు,
మీ వ్యాఖ్య చాలా బాగుంది, :)