అమృతం రుచి ఎన్నడూ చూడలేదు కాని అమ్మ ప్రేమ రుచిని మాత్రం మరు జన్మకైనా ఏ జన్మకైనా మరువలేనులే. ఎన్ని బడులు తిరిగినా అమ్మ ఒడి లో నేర్చుకున్న పాఠాలు వేరు లే. ఈ మాయా ప్రపంచం మాయలను తన కనులతో చూపింది. ప్రేమ పాశం ఎలా వుండాలో నేర్పింది. అన్నా చెల్లెళ్ళ అనుభంధం ఆమె బడి లో నే నేర్పింది. దయ,ప్రేమ,ఆవేశం,పట్టుదల లాంటి ఓనమాలతో పాటు ఈ నవ సమాజపు సవాళ్లను ఎదుర్కొనే పాఠాలనూ తనే నేర్పింది .నా వలన నా పనుల వలన కలిగే భాధని గుండెల మీద మోసిన భారాన్ని బయటకు కనిపించనివ్వదు కదా.. ఏ కష్టం వచ్చినా ఆ చల్లని ఒడిలో సేద తీర్చుకున్నాను. నా ఉన్నతికై అలుపెరగని ప్రయాణం చేసి నా సుఖమే తన సుఖమై తన ఆశలను,ఆనందాలను తనలోనే దాచుకొని బయటకు నవ్వే నవ్వు నా మనసుకేల తెలియదు. ఏ జన్మలో ఏమి ఇచ్చి ఆమె ఋణం తీర్చుకోగలను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి